ETV Bharat / state

సీఎం నుంచి సీజేకు సీల్డ్ కవర్.. పడేయమన్న ప్రభుత్వ న్యాయవాది - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

KCR sends Sealed Cover to Telangana HC CJ: తెలంగాణలో తెరాస అధ్యక్షుడి నుంచి తన కార్యాలయానికి ఒక సీల్డ్‌ కవర్‌ వచ్చిందని.. దాన్ని ఏం చేయమంటారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఇందులో ఒక సీడీ, పెన్‌ డ్రైవ్‌ తదితరాలు ఏవో ఉన్నాయని.. వాటిని అలాగే సీల్‌ చేసి పక్కన ఉంచాలని చెప్పానని సీజే వెల్లడించారు. ఆ కవర్​ను పట్టించుకోవద్దని.. దాన్ని పడేయాలని సదరు న్యాయవాది సీజేకు సూచించారు.

Telangana High Court
తెలంగాణ హైకోర్టు
author img

By

Published : Nov 16, 2022, 12:24 PM IST

KCR sends Sealed Cover to Telangana HC CJ: తెలంగాణలో తెరాస అధ్యక్షుడి నుంచి తన కార్యాలయానికి ఒక సీల్డ్‌ కవర్‌ వచ్చిందని.. దాన్ని ఏం చేయమంటారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఇందులో ఒక సీడీ, పెన్‌ డ్రైవ్‌ తదితరాలు ఏవో ఉన్నాయని.. వాటిని అలాగే సీల్‌ చేసి పక్కన ఉంచాలని చెప్పానని సీజే వెల్లడించారు. ఇలాంటి కవర్‌ తనకూ అందిందని.. ఏం చేయాలని మరో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా సంప్రదించారన్నారు.

మంగళవారం హైకోర్టులో ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీలుపై విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే సమాధానమిస్తూ.. అలా జరిగి ఉండాల్సింది కాదని, బేషరతు క్షమాపణ చెబుతున్నానన్నారు. ఇది చట్టవిరుద్ధమైన చర్య అని చెప్పారు. ఇది బాధాకరమని.. నేరుగా న్యాయమూర్తికి పంపడంపై ఆందోళన వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థలు ఇలా దర్యాప్తు విషయాలను వెల్లడించరాదన్నారు.

అయితే, అన్ని దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని వెల్లడించడం సహజమైపోయిందని చెప్పారు. ఈడీ, సీబీఐలు కూడా దర్యాప్తు అంశాలు, ఆధారాలన్నింటినీ మీడియాకు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయ సమరాలకు న్యాయవ్యవస్థలను వేదిక చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకోవాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌కు కూడా సలహా ఇస్తానన్నారు. తెరాస అధ్యక్షుడి నుంచి వచ్చిన కవర్‌ను పట్టించుకోవద్దని.. లేదంటే దాన్ని పడవేయాలని సూచించారు.

'ఇది కోర్టు ధిక్కారమే': న్యాయమూర్తులకు సీల్డ్‌ కవర్లు పంపడం న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారనడానికి నిదర్శనమని భాజపా తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ పేర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇవే రికార్డులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపామని ప్రకటించారని.. అలా పంపడం తీవ్రమైన విషయమేనన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.