ఇదీ చదవండి:
విశాఖలో ఘనంగా సంక్రాంతి సంబరాలు - government sankranthi sambaralu news
విశాఖ మధురవాడలో శిల్పారామం సంక్రాంతి పండుగ శోభతో కళకళలాడింది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అబ్బురపరిచాయి. సంక్రాంతి సంబరాలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. శిల్పారామం ప్రాంగణం అడుగడుగునా పండుగ వాతావరణం సంతరించుకుంది. రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, పొంగళ్లు వండడం వంటివి పండుగను ఒక రోజు ముందే తీసుకువచ్చాయి. కోలాటాలు, హరిదాసు సంకీర్తనలు, కర్రసాము వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విశాఖలో ఆకట్టుకున్న ప్రభుత్వ సంక్రాంతి సంబరాలు
ఇదీ చదవండి:
sample description