ఇదీ చదవండి:
పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి ముందుగానే వచ్చింది..! - sankranthi celebrations in mvp colony
పాఠశాలల్లో సంక్రాంతి ఉత్సవాలు ముందే మెుదలయ్యాయి. సెలవులకు ముందుగానే విద్యార్థులకు పండుగ ప్రాముఖ్యత వివరిస్తూ విశాఖలోని ఓ పాఠశాలలో సంక్రాతి పండుగను ఉత్సాహంగా నిర్వహించారు.
విద్యార్థులను ముందే పలకరించిన సంక్రాంతి!
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ముందుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. విద్యార్థులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి, పండుగ ప్రాముఖ్యతను తెలుపుతూ నృత్యాలు చేశారు. గంగిరెద్దుల సందడి, హరిదాసు వేషం చూపరులను ఆకట్టుకుంది. సంక్రాంతి విశిష్టత భావితరాలకు తెలియచేసేందుకే ఈ వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ దివ్యదాస్ తెలిపారు.
ఇదీ చదవండి:
sample description