ETV Bharat / state

'ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులపై చిన్నచూపెలా..?' - విశాఖలో ఆస్పత్రి సిబ్బంది ఇబ్బందులు

తమపై చిన్నచూపు తగదంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆస్పత్రుల పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నామమాత్రపు జీతాలతో సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు అందించే ఈఎస్ఐ, పీఎఫ్ తరహా సేవలు తమకూ కల్పించాని విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.

CITU Protest
పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
author img

By

Published : Sep 29, 2020, 12:20 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలంటూ 'విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్' కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రస్తుతం నాలుగు నుంచి ఆరున్నర వేలు మాత్రమే జీతాలు ఇస్తుండగా.. రూ. 16 వేలకు పెంచాలని ఆందోళన నిర్వహించారు. కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయాలని సీఐటీయూ నగర అధ్యక్షులు ఆర్కేఎస్​వీ కుమార్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి.. 'ఏపీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్​'లో చేర్చాలని పారిశుద్ధ్య కార్మికులు నినాదాలు చేశారు. ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. 20 ఏళ్లకు పైబడి సేవలందిస్తున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. మిగిలిన కార్మికులను ఆప్కాస్​లో చేర్చాలని అభ్యర్థించారు. కరోనా ఆపత్కాలంలో విధులు నిర్వహిస్తున్న వారికి రూ. 50 లక్షల ప్రమాద బీమాతో పాటు సెలవులు వర్తింపజే యాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: విశాఖలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.