అనారోగ్యంతో బాధపడుతున్న జీవీఎంసీ పారిశుద్ధ్య సూపర్‌వైజర్ వడ్డాది సంతోషి (33) ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అధికారుల వేధింపుల కారణంగానే సంతోషి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. సంతోషి మృతదేహంతో జీవీఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పదేళ్ల క్రితం సంతోషి భర్త మృతి చెందగా... ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
ఇదీ చదవండి: