ETV Bharat / state

చేతబడి చేస్తున్నాడనే నెపంతో...వ్యక్తి సజీవ దహనం

విశాఖ మన్యంలో అమానవీయ ఘటన జరిగింది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో సజీవ దహనం చేసిన ఘటన విశాఖ మన్యంలో జరిగింది.

చేతబడి చేస్తున్నాడనే నెపంతో...వ్యక్తి సజీవ దహనం
author img

By

Published : Sep 26, 2019, 6:50 AM IST

విశాఖ మన్యంలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గిరిజనుడిని సాటి గిరిజనులే చిత్రహింసలు పెట్టి సజీవ దహనం చేశారు. డుంబ్రిగూడ మండలం పుట్టబంద గ్రామానికి చెందిన కిల్లి జయరాంను.. కొందరు గిరిజనులు పంచాయితీకి పిలిచారు. అక్కడికి వెళ్లగానే జయరాంను తాళ్లతో కట్టేసి కర్రలతో కొట్టారు. బాధితుడి భార్య, కుమార్తె ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. 4గంటలపాటు చిత్రహింసలు పెట్టిన అనంతరం జయరాం కాళ్లు చేతులు కట్టేసి.... ఊరి నడిబొడ్డున కర్రలు పేర్చి అందులో వేసి సజీవదహనం చేశారని మృతుడి భార్య, కుమార్తె విలపిస్తున్నారు. అడ్డుకోబోయిన తమను చంపుతామని బెదిరించటంతో రాత్రికి రాత్రే వేరే గ్రామానికి వెళ్లి తలదాచుకున్నామని వాపోయారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో జయరాంను అమానుషంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

చేతబడి చేస్తున్నాడనే నెపంతో...వ్యక్తి సజీవ దహనం

ఇవీ చూడండి-'ఎన్నాళ్లీ 'డోలీ' కష్టాలు... అష్టకష్టాలు పడాల్సిందేనా?'

Intro:వైద్యం వికటించి బాలింత మృతిBody:వాయిస్:-నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇరవై రోజుల క్రితం ఓ పాపకు జన్మనిచ్చిన కరటంపాడు సునీతకు రెండు రోజులుగా జ్వరం వస్తుండడంతో అదే గ్రామంలో ఉన్న ఓ ప్రైవేటు నర్స్ వద్దకు జ్వరానికి మందుల కోసం వెళ్ళింది. పరీక్షించిన నర్సు ఇంజక్షన్ ఇచ్చింది. కొద్దిసేపటికే సునీతకు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇంజక్షన్ వికటించి ఉందని గ్రహించిన ఆ నర్సు వెంటనే విరుగుడుకి మరో ఇంజక్షన్ వేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెను వెంటనే ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇరవై రోజుల క్రితం పాపకు జన్మనిచ్చిన సునీత మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.Conclusion:బైట్ శెఖర్ మృతురాలు తమ్ముడు. కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.