'సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్' సికోమ్, పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మకంగా సముద్ర తీరాల అభివృద్ధికి నాంది పలికాయి. 'ఐయామ్ సేవింగ్ మై బీచ్' పేరిట విశాఖ రుషికొండ సహా దేశవ్యాప్తంగా మరో 12 బీచ్‌లను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచ పర్యటకులు, పర్యావరణ ప్రేమికుల్లో ఎంతో ప్రాధాన్యమున్న... 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్ సాధించే దిశగా అవసరమైన మౌలిక వసతులు, భద్రతా పరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం రుషికొండ బీచ్‌లో పరిశుభ్రతకు ప్రాధాన్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇసుక తిన్నెలపై ఎలాంటి వ్యర్థాలు లేకుండా జాగ్రత్త పడతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలు అక్కడ వేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీచ్ వద్ద సూచనల బోర్డులు, వాచ్ టవర్లు, టాయిలెట్లు, నీడనిచ్చే గొడుగులు వంటివి పూర్తిగా పర్యావరణ హితంగా ఏర్పాటు చేశారు. రుషికొండ బీచ్‌లో మార్పు చూసి పర్యటకులు ఆనందపడుతున్నారు.
సురక్షిత-పరిశుభ్ర బీచ్‌ల ఏర్పాటు ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తున్నామని పర్యటకశాఖ అధికారులు చెబుతున్నారు. రెండో దశ అభివృద్ధి ప్రణాళికలకు రాష్ట్రం నుంచి 25 బీచ్‌లను ప్రతిపాదించినట్లు తెలిపారు. బీచ్‌ల పరిశుభ్రతకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ప్రణాళికలు సత్ఫలితాలిస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: