విశాఖలో కరోనా కేసులు 1238కి చేరాయి. మద్యం ప్రియులు కరోనా భయం వదిలి మందు కోసం బారులు తీరారు. గాజువాక, హనుమంతవాక, పెద్ద వాల్తేరు, విశాఖ నగర పరిధిలో ఉన్న మద్యం దుకాణాల దగ్గర మందుబాబులు గుంపులు గుంపులుగా చేరారు. మాస్క్లు, భౌతికదూరం ఊసేలేకుండా మద్యం కోసం ఎగబడటంఫై నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ ఎక్సైజ్ శాఖ దీనిపై దృష్టి పెట్టకపోతే నగరానికి మరింత కరోనా ముప్పు పొంచి ఉంటుందని అంటున్నారు.
ఇదీ చూడండి