విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్బీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. అర తులం బంగారు వస్తువులు, 44 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్టు బాధితులు తెలిపారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ రాము తెలిపారు.
ఇదీ చూడండి: