ETV Bharat / state

రెండు చోరీ కేసులు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

24 గంటల్లోనే విశాఖ పోలీసులు రెండు చోరీ కేసులను ఛేదించారు. సొత్తును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. విశాఖ నగర క్రైమ్​ డీసీపీ వి.సురేష్ బాబు వివరాలను మీడియాకు వివరించారు.

police
రెండు చోరీ కేసులు.. 24 గంటల్లోనే ఛేదించిన విశాఖ పోలీసులు
author img

By

Published : Feb 17, 2021, 10:11 PM IST

విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పామ్ బీచ్ హోటల్ పార్కింగ్​లో జరిగిన దొంగతనాన్ని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. చోరీ సొత్తును స్వాధీన పరుచుకుని నిందితులను అరెస్టు చేశారు. కూతురు నిశ్చితార్థం కోసం పామ్ బీచ్ హోటల్​కు వచ్చిన రామలక్ష్మి అనే మహిళ.. కారును పార్కింగ్​లో ఉంచి హోటల్​ గదిలోకి వెళ్లారు. కంగారులో ఆమె కారు అద్దం వేయడం మరిచిపోయారు. కొద్దిసేపటి తరువాత వచ్చి చూసుకోగా కారులో వదిలివెళ్లిన నగల బాక్స్ కనిపించలేదు. వెంటనే మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఎంవీపీ ప్రాంతంలో టిఫిన్ సెంటర్ నడుపుతున్న రాజమహేంద్ర, రేవతి, విశ్వేశ్వరరావు, వినోద్ కుమార్​లను విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. చోరీకి గురైన నాలుగు లక్షల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్, బ్రేస్ లెట్, తొమ్మిది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.

రాయి విసిరి.. నగదు అపహరించి..

కలకత్తా నుంచి బెంగళూరుకు కంప్యూటర్ల లోడ్​తో వెళుతున్న లారీపై ఈనెల 15వ తేదీ తెల్లవారుజామున తాటిచెట్లపాలెం ప్రాంతంలో ముగ్గురు యువకులు రాళ్లు విసిరి లారీ డ్రైవర్ వద్ద ఉన్న తొమ్మిది వేల రూపాయల నగదును తీసుకొని పారిపోయారు. అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా... నాలుగో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి తాటిచెట్లపాలెంలో కేటరింగ్ పనులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి తొమ్మిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకొని.. ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఓ బాలుడ్ని జువనైల్ హోంకు తరలించారు.

ఇదీ చదవండి: ఓటు వేసేందుకు వెళ్తుండగా జీపు బోల్తా.. 15 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.