ETV Bharat / state

Roads Around YSRCP Leaders Properties: విశాఖలో ప్రజాధనంతో.. వైసీపీ నేతల ఆస్తుల చుట్టూ రోడ్లు

Roads Around YSRCP Leaders Properties: రోడ్లు బాగోలేదంటూ నాలుగేళ్లుగా ప్రజలు ప్రశ్నిస్తున్నా పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం.. విశాఖలో వైసీపీ నేతల ఆస్తులకు మాత్రం రాచ'బాటలు' పరుస్తోంది. పెద్దల ఆస్తుల చుట్టూ చకచకా రోడ్లు వేసేస్తున్నారు. సీఎం బంధువులు, బినామీల విల్లాల వరకూ దర్జాగా నిర్మాణం చేపడుతున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి ఆఘమేఘాలపై విస్తరిస్తున్నారు. 350 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వాటికి మాత్రం అతీగతీ లేదు.

Roads Around YSRCP Leaders Properties
Roads Around YSRCP Leaders Properties
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 11:44 AM IST

Roads Around YSRCP Leaders Properties : విశాఖలో వైఎస్సార్సీపీ పెద్దల ఆస్తుల విలువ పెంచుకునేందుకు 'బాట'లు పడుతున్నాయి. పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కీలక నేతలు పలు ప్రాజెక్టులు, కొన్ని ప్రైవేటు ఆస్తులను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. వాటి చుట్టూ ప్రభుత్వ సొమ్ముతో అందంగా రహదారులు నిర్మించడానికి 'మాస్టర్‌ ప్లాన్‌' వేశారు. నగరంలో లక్షల మంది ప్రజలు నిత్యం సంచరించే రహదారుల అభివృద్ధిపై డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసురాని అధికార యంత్రాంగం.. పెద్దల ఆస్తులున్నచోట రోడ్ల నిర్మాణానికి ప్రజాధనాన్ని కోట్ల రూపాయలలో కుమ్మరిస్తోంది.

YSRCP Government Wasting Public Money : విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ బృహత్తర ప్రణాళికలో ప్రాధాన్యమున్న వాటిని కూడా పక్కనపెట్టి నేతల ఆస్తుల చుట్టూనే రోడ్లు విస్తరిస్తూ అదే అభివృద్ధి అంటూ హడావుడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంగా రుషికొండ (Rushikonda) పేరు తెరపైకి తెచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దల విల్లాలు, ప్రాజెక్టులకు విలువ పెంచుకునే తతంగం విశాఖ వాసులను నివ్వెరపరుస్తోంది.

Wasting Public Money in AP : మధురవాడ వద్ద జాతీయ రహదారి నుంచి న్యాయ కళాశాల మీదుగా పెబల్‌ బీచ్‌ హౌసింగ్‌ ప్రాజెక్టు వరకు VMRDA (Visakhapatnam Metropolitan Region Development Authority) నిధులు కుమ్మరిస్తోంది. రుషికొండకు వెళ్లే ఈ దారిలో ప్రభుత్వ పెద్దల ప్రాజెక్టులు, విల్లాలు ఉండటమే దీనికి కారణం. రోడ్డు పక్కనే వైఎస్సార్సీపీ కార్యాలయానికి విలువైన స్థలం కేటాయించారు. ఇది దాటగానే ఓ మంత్రి సోదరుడు చేపడుతున్న బహుళ అంతస్తుల ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో ఉత్తరాంధ్రకు గతంలో ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన నేతకు భాగస్వామ్యం ఉందని సమాచారం. తన కుమార్తెకు ఇక్కడే విల్లా నిర్మిస్తున్నారు.

Andhra Pradesh Roads in Worst Condition: అడుగుకో గుంత.. ప్రజలకు నరకం.. పట్టించుకోని అమాత్యులు

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు తనకు ఒక స్థల వ్యవహారంలో వీఎంఆర్‌డీఏ ప్రత్యామ్నాయంగా కేటాయించాల్సిన భూమిని ఇదే రోడ్డులో పెబల్‌ బీచ్‌ పక్కనే కోరుకుంటున్నారు. కాస్త ముందుకెళితే రేడియంట్‌ నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డికి (MP Vemireddy Prabhakareddy )చేతులు మారిన వీపీఆర్‌ ప్రాజెక్టు 50 ఎకరాల్లో ఉంది. ఓ మంత్రి సోదరుడు, ఎంపీ వేమిరెడ్డికి చెందిన రెండు ప్రాజెక్టుల్లో తాడేపల్లి పెద్దలకు భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే న్యాయ కళాశాల రోడ్డు చివరి వరకు 3.10 కి.మీ. ఆఘమేఘాలపై విస్తరిస్తున్నారు. ఈ రోడ్డు ఇప్పటికే పచ్చదనంతో బాగున్నా మళ్లీ అదనపు హంగులద్దుతున్నారు. రహదారికి ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పున విస్తరించి కాలిబాట, సుందరీకరణకు రూ.5.50 కోట్లు వెచ్చిస్తున్నారు.

నాలుగు సంవత్సరాల కిందట నిర్మించిన ఈ మాస్టర్‌ ప్లాన్‌ 100 అడుగుల రోడ్డు కోసం అధికారులు నిధుల వర్షం కురిపించారు. డివైడర్‌లో ఆధునిక విద్యుత్తు దీపాల పనుల కోసం వీఎంఆర్‌డీఏ ఇప్పటికే 13.45 కోట్లు ఖర్చు చేసింది. 2019 ఆగస్టులో ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. సుందరీకరణ, పచ్చదనం పెంపు కోసం గత ఏడాది అక్టోబరు 15న వీఎంఆర్‌డీఏ (VMRDA) బోర్డు సమావేశంలో అదే రోడ్డుకు మళ్లీ రూ.1.42 కోట్లు కేటాయించారు. ఇలా ఒకే రోడ్డుపై పదేపదే ప్రేమ పుట్టుకురావడం వెనుక తాడేపల్లి 'ఒత్తిళ్లు' ఉన్నట్లు విమర్శలున్నాయి.

వీఎంఆర్‌డీఏ దాదాపు రెండేళ్ల క్రితం రూపొందించిన బృహత్తర ప్రణాళికలో ప్రతిపాదించిన ఎన్నో రహదారులకు మోక్షం కలగలేదు. కానీ బోయపాలెం కూడలి నుంచి కాపులుప్పాడ మీదుగా బీచ్‌ రోడ్డుకు కలిసే రహదారికి మాత్రం ఇటీవల యుద్ధప్రాతిపదికన పచ్చజెండా ఊపారు. ఈ రహదారిలో సీఎం చిన్నాన్న వైఎస్‌ రవీంద్రనాథ్‌రెడ్డి 'విల్లాసం' పేరుతో 11 ఎకరాల్లో 62 విల్లాలు నిర్మిస్తున్నారు. ఈ కారణంతోనే ఎన్‌హెచ్‌ 16 బోయపాలెం కూడలి నుంచి కాపులుప్పాడ గ్రామానికి 2.80 కి.మీ. రెండు వరుసల్లో వంద అడుగుల రోడ్డు విస్తరణకు వీఎంఆర్‌డీఏ రూ.4.59 కోట్లతో ప్రతిపాదించి పనులు వేగంగా చేపట్టింది. మరోవైపు బీచ్‌ రోడ్డు నుంచి విల్లాసం ప్రాజెక్టు వైపు రోడ్డు పనులకు రూ.1.03 కోట్లు, విస్తరణ అనంతరం డ్రైనేజీ నిర్మాణానికి కొద్ది రోజుల కిందటే రూ.4.64 కోట్ల జీవీఎంసీ నిధులు కేటాయించారు.

CM residence on Rushikonda: రుషికొండపై సీఎం కార్యాలయం కోసం కళింగ బ్లాక్‌.. నివాసం కోసం విజయనగర బ్లాక్‌..!

YCP Government Using Public Money for Its Own Purposes :మధురవాడలో న్యాయకళాశాల మీదుగా వంద అడుగులు విస్తరించిన రహదారికి సమాంతరంగా ఎంవీవీ సిటీ ఉంది. కేవలం 250 మీటర్లతో దూరంలో మళ్లీ ఇక్కడ వంద అడుగుల రోడ్డు నిర్మించారు. ఇది కేవలం ఎంవీవీ సిటీ కోసమే చేయడం.. దానికి ఎంపీ నిధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ఎంపీకి చెందిన ప్రాజెక్టులున్న సాయిప్రియ లేఅవుట్స్‌ వద్ద, బీచ్‌ రోడ్డులో రాడిసన్‌ బ్లూ ఎదురుగా సిల్వర్‌ హోమ్స్‌ ప్రాజెక్టుకు సమీపంలో వీఎంఆర్డీఏ నిధులతో రాచబాటలు వేశారు.

తాజాగా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో రూ.160 కోట్లతో 20 రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇందులో కూర్మన్నపాలెంలో రూ.11.39 కోట్లతో నాలుగు రహదారుల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో ఎంవీవీ అండ్‌ ఎంకే హౌసింగ్‌ పేరుతో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులో ప్లాట్ల ధరలు పెంచుకునేలా దీనికి ఎటు వైపు నుంచి అయినా చేరుకునేలా ఈ రోడ్ల ప్రతిపాదన ఉంది.

ఏడాదిన్నర క్రితం స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడితో వీఎంఆర్‌డీఏ 350 కోట్ల రూపాయలతో వివిధ ప్రాంతాల్లో ముఖ్యమైన 12 రోడ్లకు ప్రతిపాదనలు చేసింది. వాటిలో ఏ ఒక్కటీ చేపట్టలేదు. ఎస్‌ఆర్‌పురం- బక్కన్నపాలెం, నీలకుండీలు- కొత్తవలస, భీమిలి- తగరపువలస, అడవివరం- శొంఠ్యాం, పెదముషిడివాడ కూడలి- ట్రైజంక్షన్‌ వంటి కీలక రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనలను అధికారులు అటకెక్కించేశారు.

Tribals Four KMs Doliyatra for Roads: 'పలకరా అన్నలూ..ఎన్నాళ్లీ డోలీ మోతలు'.. వినూత్నంగా గిరిజనుల నిరసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.