విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మద్దిలపాలెం వెళ్లే ప్రధాన రహదారి వెంబడి వ్యాపార దుకాణాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులు ఆదేశించారు. దుకాణాలుండే ఫుట్‌పాత్‌లను జేసీబీతో పగలగొట్టారు. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, జిరాక్స్ దుకాణాలు, చిన్నచిన్న హోటల్స్, కూల్‌డ్రింక్ షాపులు ఇలా అనేకం ఫుట్‌పాత్‌లపై ఉన్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. హఠాత్తుగా తమ దుకాణాలు తొలగించమంటే తాము ఎక్కడికి వెళ్లాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
నీటిపారుదల శాఖ పరిధిలోని స్థలంలో ఉన్న దుకాణాలను నగరపాలక సంస్థ ఎలా తొలగిస్తుందంటూ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులు పునరాలోచించాలని లేదంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..
'కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు మూణ్నెళ్లు పట్టొచ్చు'