విశాఖ జిల్లా సిరిమామిడి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం గబ్బడ నుంచి చేపల లోడుతో వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో గెమ్మిలి దావీదు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విశాఖలో వివాహిత దారుణ హత్య