ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడిన ఘటన విశాఖ జిల్లా రోలుగుంట మండలం పెద్దపేటలో జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న బస్టాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి...