విశాఖపట్నం జిల్లా చోడవరం ప్రాంతంలో శారదా, పెద్దేరు నదుల్లో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. తెన్నేటి విశ్వనాథం (పెద్దేరు), బొడ్డు సూర్యనారాయణ మూర్తి (రైవాడ) జలాశయాల నుంచి వరద నీటిని స్పిల్వే గేట్లు ద్వారా విడుదల చేశారు.
భారీ ప్రవాహం..
జుత్తాడ, గోవాడల వద్ద శారదా నది, వడ్డాది.. గౌరీపట్నం, బెన్నవోలు వద్ద పెద్దేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.