పుర ఎన్నికల సందర్భంగా విశాఖలో అధికారులు మద్యం అమ్మకాలపై పరిమితిని విధించారు. మద్యం దుకాణాల ఎదుట బోర్డులు పెట్టాలని ఉత్తర్వులు జారీచేశారు. ఒక్కరికి రూ.250 ధర పైబడిన మద్యం సీసాలను మూడు మాత్రమే విక్రయించాలని నిర్దేశించారు. రూ.200 ధరకు దిగువనున్న మద్యం సీసాలను ఒకరికి.. ఒక్కటి మాత్రమే అమ్మాలని స్పష్టం చేశారు. 750, 650 ఎంఎల్ ఉన్న బీర్సీసాలను ఒకరికి.. ఒక్కటి మాత్రమే విక్రయించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎపీఎస్బీసీఎల్ విశాఖ డిపో మేనేజర్ వెల్లడించారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినికి బాక్సింగ్‌లో బంగారు పతకం