ఎనిమిది నెలల గర్భిణీ అయినా... పేదరికంతో 5 కిలోమీటర్ల దూరం నడిచి రైతు బజార్లో పూలు అమ్ముకుంటోంది అరుణ. అరుణ పరిస్థితిపై 'ఈటీవీభారత్'లో "8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!" శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, మాజీమంత్రి మణికుమారి స్పందించారు. పాడేరు అంగన్వాడీ సూపర్వైజర్లను వెంటబెట్టుకొని... అరుణ ఇంటికి వెళ్లారు. గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని అరుణకు చెప్పారు. అనంతరం అంగన్వాడీ కార్యాకర్తలు, గ్రామస్థులతో కలిసి అరుణకు సీమంతం చేశారు.
ఇదీ చదవండి: 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!