స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్ష కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 38వ రోజుకు చేరుకున్నాయి. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేత జగన్ పాల్గొన్నారు. కరోనా వల్ల దేశంలో వేలాది మంది చనిపోతున్నారని… కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా సరే మోదీకి వినిపించలేదని నేతలు మండిడ్డారు.
ప్రజల ఆరోగ్యం కంటే… ఎన్నికలు, అధికారం కోసం పాకులాడటం వల్ల సెకండ్ వేవ్‌లో లక్షల మంది చనిపోతున్నారని అన్నారు. కరోనా కంటే కూడా ప్రైవేటీకరణ అనే రోగం ప్రమాదకరమైందని ఇప్పటికే ప్రైవేటీకరణ జరిగిన దగ్గర దేశాల్లో లక్షలాది మంది కుటుంబాలు ఉద్యోగాలు పోయి రోడ్డు పడ్డారని వాపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవాలని అన్నారు. ఇప్పటికే అఖిలపక్ష కార్మిక విద్యార్ధి యువజన, మహిళా, మేధావులు అందరూ ఒకమాట మీదకు వచ్చి పోరాడుతున్నారన్నారని తెలిపారు.
ఇదీ చూడండి: