కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టడంతో విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతానికి సంబంధించి పలు చిన్న తరహా పరిశ్రమలు తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నర్సీపట్నంతో పాటు రోలుగుంట రావికమతం, గొలుగొండ, మాకవరపాలెం తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు నడుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా నర్సీపట్నంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కాఫీ గింజల శుద్ధీకరణ తోపాటు ఎగుమతి పనులు జోరందుకున్నాయి. ఈ కాఫీ క్యూరింగ్ సెంటర్లో సుమారు 200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. లాక్ డౌన్ సమయం లో వీరంతా సుమారు ఆరు నెలల పాటు పనులు లేక ఉపాధి కరవై ఉండిపోయారు.
మాకవరపాలెం, నాతవరం తదితర ప్రాంతాల్లో ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తున్న జీడి పిక్కల కర్మాగారాలు ఆయా పనులు పున ప్రారంభమయ్యాయి. రోలుగుంట మండలాల్లో విస్తరాకులు తయారీని తిరిగి ప్రారంభించారు. రావికమతం మండలం కొత్తకోటలో కాగితపు కంచాల తయారీలో కార్మికులు తిరిగి పనుల్లో నిమగ్నమయ్యారు.ఈ చిన్న తరహా పరిశ్రమల్లో లాక్ డౌన్ తర్వాత ఓ పక్క ఉత్పత్తులు తయారీ మెరుగుపడటంతో పాటు ఎగుమతులు అదే క్రమంలో ఉండడంతో మహిళలకు ఆర్థికపరంగా భరోసా ఇస్తున్నాయి.
ఇవీ చదవండి