ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై దాడులు - విశాఖపట్నం జిల్లాలో తాజా క్రైమ్ న్యూస్

లాక్​డౌన్​​ కారణంగా నాటుసారా తయారు చేయడం.. అమ్మడం లాంటివి చేయకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినపప్పటికీ కొంతమంది వ్యక్తులు పోలీసుల మాటలను పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.

నాటుసారా స్థావరాలపై దాడులు
నాటుసారా స్థావరాలపై దాడులు
author img

By

Published : May 2, 2020, 12:10 AM IST

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాల్లో ఎక్సైజ్​, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు​ వివిధ గ్రామాల్లో దాడులు చేశారు. 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 3300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్ సీఐ బాల నరసింహులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేసి కేసునమోదు చేసినట్లు తెలిపారు.

విశాఖ జిల్లా ఆనందపురంలోని చెక్​పోస్ట్​ వద్ద ఆటోలో తరలిస్తున్న 13 లీటర్ల నాటుసారాను పోలీసులు పట్టుకున్నారు. నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, ఆటోని సీజ్ చేశారు. మరో కేసులో గవరపాలెం వద్ద 600 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఇద్దరు వ్యక్తులను నాటుసారా రవాణా చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నందిగాం మండలం తురకలకోట కూడలిలో వాహన తనిఖీలు చేస్తుండగా కూరగాయల కింద నాటుసారా డబ్బాలు ఉండటాన్ని గుర్తించారు. నిందితులు గత కొంతకాలంగా ఒడిశా రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల నుంచి సారా తీసుకొస్తున్నట్లు ముందస్తు సమాచారం రావటంతో దాడిచేసి పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రమేష్ బాబు తెలిపారు. ఈ నిందితులపై కేసు నమోదు చేసి 20 లీటర్ల నాటుసారాతో పాటు బొలేరో వాహనాన్ని సీజ్ చేశామన్నారు.

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 40 లీటర్ల నాటుసారాతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: నాటుసారా విక్రయిస్తున్న వాలంటీర్ సోదరుడు... వీడియో వైరల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.