కన్న తండ్రి స్థానంలో ఉండి కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని కూతురు వరుసయ్యే పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వంటచెరుకు కోసం తీసుకెళ్లి...
విశాఖ జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన కొర్రా ఇజ్రాయిల్ అనే వ్యక్తి ఓ గిరిజన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు గతంలోనే వివాహం కాగా భర్త చనిపోయాడు. పదేళ్ల వయసున్న కుమార్తె ఉంది. తల్లి లేని సమయంలో ఇజ్రాయిల్.. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వంటచెరుకు కోసమని తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: couple death case: 'భార్యను హత్య చేసి.. భర్త ఉరివేసుకున్నట్టు భావిస్తున్నాం'