విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం కాకరపాడు పెట్రోల్‌బంకులో పెట్రోల్‌కు బదులు వర్షపు నీరు వస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాకరపాడులోని హిందుస్థాన్ పెట్రోలియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులోని.. మూడు ట్యాంకర్‌లలో వర్షపు నీరు చేరింది. దీంతో వాహన వినియోగదారులు పెట్రోల్ కొనుక్కోవడానికి వెళ్లితే వర్షపు నీరు వస్తుండటంతో అవాక్కయ్యారు.
దీంతో కొనుగోలుదారులు విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు హెచ్‌పీ సంస్థతో మాట్లాడారు. వర్షాలకు బంకులో పెట్రోల్ వర్షం నీరుతో కలిసిందని.. మూడు ట్యాంకర్‌లలో వర్షపు నీరు చేరి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వెంటనే పెట్రోల్ అమ్మకాలు నిలిపివేసి టెక్నీషియన్స్‌ను కాకరపాడు రప్పించి మోటార్లతో నీటిని తోడేసారు. బంకులో ఉన్న పెట్రోల్, డీజిల్‌లను పరీక్షలకు పంపించిన అనంతరం అమ్మకాలు చేస్తామని జీసీసీ మేనేజర్ తెలిపారు.
ఇదీ చదవండీ.. visakha steel: విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ గాజువాకలో పాదయాత్ర