విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో రెండో విడతగా సరఫరా చేసిన శనగల్లో రాళ్లు ఎక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు ఆరోపించారు. కిలో శనగల్లో 100 గ్రాముల వరకూ రాళ్లు ఉంటున్నాయని వాపోయారు. సరుకుల్లో నాణ్యత లోపిస్తోందని.. రేషన్ బియ్యంలో సైతం తెల్ల పురుగులు వస్తున్నాయని అన్నారు. దీనికి తోడు చౌక దుకాణాల్లో తూకాల్లో తేడాలు ఉంటున్నాయని ఆరోపించారు. అధికారులు దీనిపై స్పందించి రేషన్ డీలర్లు మంచి సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి..