పెందుర్తి - అనకాపల్లి రహదారిలో గొల్లపల్లి వద్ద కొండచిలువ కనిపించింది. వంతెన నిర్మాణ పనుల కోసం ఉంచిన ఇనుప చువ్వల మధ్య ఉన్న కొండచిలువను చూసి కూలీలు భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా పాములు పట్టే గణేశ్ అనే వ్యక్తికి సమాచారం అందించటంతో..అతను చాకచక్యంగా దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. చుట్టు పక్కలంతా అరణ్య ప్రాంతం కావటంతో రోజూ పాములు వస్తున్నాయని కూలీలు తెలిపారు.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్