ETV Bharat / state

వైద్యం కోసం.. ఆసుపత్రికి వెళ్లాలంటే ఇదీ దుస్థితి...

సరైన రహదారి సౌకర్యం లేక విశాఖ మన్యంలో గర్భిణులు.. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయానికి అంబులెన్సులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఓ గర్భిణికి పురిటి నొప్పలు వస్తే.. డోలీలో తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

problems of pragnency  ladies
ఏజెన్సీలో వైద్యం కోసం గర్భిణీ ఇబ్బందులు..
author img

By

Published : Mar 17, 2021, 5:16 PM IST

విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్ పంచాయతీ బొడ్లమామిడి గ్రామ గిరిజన గర్భిణి గోళ్లూరి పార్వతి ప్రసవ వేదనతో బాధపడుతోంది. హాస్పిటల్​కు తీసుకెళ్లేందుకు 108కు ఫోన్ చేశారు. అయితే రహదారి లేకపోవటంతో.. అంబులెన్స్​ గ్రామంలోకి రాలేదు. ఈ కారణంగా గ్రామస్థులు ఆమెను డోలీలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లాపుట్ వరకు మోసుకెళ్లారు. అధికారులు స్పందించి కొల్లాపుట్ జంక్షన్ నుంచి బొడ్లమామిడి గ్రామం వరకు తారు రోడ్ నిర్మించాలని స్థానికులు కోరారు.

ఏజెన్సీలో వైద్యం కోసం గర్భిణీ ఇబ్బందులు..

ఇదీ చదవండీ.. రసవత్తరం.. తాడిపత్రి ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.