లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నా లేకున్నా వ్యాధి పూర్తిగా నియంత్రణ అయ్యే వరకు నియమాలు పాటించాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా ఈ లక్షణాలుంటే దూరం పెట్టాలి. వీలైనంత వరకు వేరే గదిలో ఉంటే మేలు.
చేతులను ఎక్కువసార్లు 20 సెకన్ల చొప్పున శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత అవసరం. శరీరంలోని ముఖ్య భాగాలను చేతులతో తాకరాదు. మాస్కులు ధరించాలి. సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోతే.. వైద్యునితో ఫోన్‌లోనే మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాలి. వారి సూచనల ప్రకారం అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ సరైన సమయంలోనే చేయించుకోవాలి. వైద్య రిపోర్టులను వాట్సాప్ ద్వారా వైద్యులకు తెలియజేయాలి.
ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం మందులు, నిర్ధారిత టీకాలు కొనసాగించవచ్చు. హై రిస్కు కేసుల విషయంలో వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరి.
సాధారణ స్త్రీల వ్యాధులకు వైద్యం వాయిదా వేసుకోవాలి. పిల్లలు లేనివారు దీనికి సంబంధించిన పరీక్షలు, ట్రీట్‌మెంట్ వాయిదా వేసుకోవాలి. కొవిడ్ వైరస్ గర్భస్థ శిశువు మీద ఎటువంటి ప్రభావాలు కలగజేస్తుందో స్పష్టత లేదు.
కరోనా లక్షణాలు కనిపించినా.. రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం, కాళ్లు, ముఖం వాపులు, విపరీతమైన తలనొప్పి, బిడ్డ కదిలికలు సరిగ్గా తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్నా, పురిటి నొప్పులు మొదలైనా 108 వాహనం లేదా వైద్యులను సంప్రదించాలి.
కొవిడ్ వైరస్ కారణంగా గర్భిణీలకు జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులొస్తే నెలలు నిండకుండానే ప్రసవం, ముందుగానే ఉమ్మనీరు పోవటం, శిశు మరణాలకు అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
కరోనా సోకిన గర్భిణీకి స్త్రీ, శిశు, వైద్య, ఛాతీ, మత్తు విభాగాల వైద్య బృందం వైద్య సేవలందిస్తుంది. కరోనా వైరస్ సోకిన తల్లి, బిడ్డ ఒకే గదిలో ఉండాల్సి వచ్చినప్పుడు ఆరు అడుగుల దూరం పాటించాలి. తల్లి పాలలో వైరస్ ఉండకపోయినా ఆమెకు దగ్గరగా శిశువు ఉండడం వల్ల వైరస్ సోకేందుకు అవకాశం ఉంది.
ఇదీ చదవండి: