విశాఖ ఏజెన్సీలో ద్విచక్ర అంబులెన్స్‌లోనే గర్భిణీ ప్రసవించింది. అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ కోటపర్తిలో ఓ నిండు గర్భిణిని బైక్ అంబులెన్స్‌పై ఆసుపత్రికి తరలించారు. 15 కిలోమీటర్ల రాళ్లు తేలిన కొండ మార్గం గుండా ఆమెను తీసుకువెళ్తుండగా... మార్గ మధ్యలోనే ప్రసవం జరిగింది. అనంతరం ఆసుపత్రికి జాగ్రత్తగా తల్లీబిడ్డలను తరలించారు. ఈ విషయంలో వైద్యుడికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి..
రక్తదానంపై అవగాహన కల్పిస్తూ.. సైకిల్‌పై 9 వేల కి.మీ. ప్రయాణం