ETV Bharat / state

రహదారే ప్రసవ స్థలం.. బైక్ అంబులెన్స్​లో కాన్పు

author img

By

Published : Mar 23, 2020, 2:37 PM IST

నిండు గర్భణి.. బైక్ ఫీడర్ అంబులెన్స్​లో ప్రసవించింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన కొట్టనాపల్లి వద్ద ఈ ఘటన జరిగంది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

pregnant delivery at road side
రోడ్డు పక్కనే ప్రసవించిన ఏజెన్సీ మహిళ
రోడ్డు పక్కనే ప్రసవించిన ఏజెన్సీ మహిళ

ప్రసవం కోసమని ఆసుపత్రికి వెళ్తున్న ఓ నిండు గర్భణి.. బైక్ ఫీడర్ అంబులెన్స్​లో రోడ్డుపైనే ప్రసవించింది. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం కొట్టనాపల్లి వద్ద జరిగింది. రంగశీల పంచాయతీ బలురోడలకు చెందిన లలిత కుమారి అనే గర్భణి.. ప్రసవ నొప్పులతో బాధపడుతుండగా.. బైక్ అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. బలులోడ నుంచి కొట్టనాపల్లి వద్దకు వచ్చేసరికి నొప్పులు అధికమయ్యాయి. బైక్ అంబులెన్స్​లోనే రహదారి పక్కన పాపకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రసవం కోసమని ముందుగానే జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

అరకులోయలో జనతా కర్ఫ్యూ ఎలా జరిగిందంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.