విశాఖ సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఆగష్టు 11న డొంకరాయి పవర్ కెనాల్కు గండిపడి జెన్కోకి నష్టం వాటిల్లింది. అయితే జెన్కో అధికారులు పవర్ కెనాల్ నుంచి నీటి విడుదల నిలిపివేసి జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవటంతో పెద్ద ఎత్తున వర్షాలు పడటంతో గండి పూడ్చే పనులకు ఆటంకం కలిగింది. అధికారులు రేయింబవళ్లు శ్రమించటంతో ఈ నెల 16 నాటికి పనులు పూర్తయ్యాయి. దీంతో పవర్ కెనాల్ నుంచి నీటి విడుదల ప్రారంభించారు. ప్రస్తుతం 17 మెగావాట్ల లోడుతో విద్యుత్ ఉత్పత్తి అధికారులు చేస్తున్నారు. పవర్ కెనాల్ ద్వారా 11.5 అడుగుల మేరకు నీటిని విడుదుల చేస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.
డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి - విశాఖ సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి
విశాఖ సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.
విశాఖ సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఆగష్టు 11న డొంకరాయి పవర్ కెనాల్కు గండిపడి జెన్కోకి నష్టం వాటిల్లింది. అయితే జెన్కో అధికారులు పవర్ కెనాల్ నుంచి నీటి విడుదల నిలిపివేసి జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవటంతో పెద్ద ఎత్తున వర్షాలు పడటంతో గండి పూడ్చే పనులకు ఆటంకం కలిగింది. అధికారులు రేయింబవళ్లు శ్రమించటంతో ఈ నెల 16 నాటికి పనులు పూర్తయ్యాయి. దీంతో పవర్ కెనాల్ నుంచి నీటి విడుదల ప్రారంభించారు. ప్రస్తుతం 17 మెగావాట్ల లోడుతో విద్యుత్ ఉత్పత్తి అధికారులు చేస్తున్నారు. పవర్ కెనాల్ ద్వారా 11.5 అడుగుల మేరకు నీటిని విడుదుల చేస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.
సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో సోమవారం ఉదయం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో సుమారు 70 రోజుల అనంతరం డొంకరాయి జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఆగస్టు 11 అర్ధరాత్రి డొంకరాయి పవర్ కెనాల్ కు గండి పడి పెద్ద ఎత్తున జెన్కో కి నష్టం వాటిలోని సంగతి తెలిసిందే అయితే పవర్ కెనాల్కు గండి పడటంతో ఏపీ జెన్కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన వెనువెంటనే పవర్ కెనాల్ నుంచి నీటి విడుదల నిలుపుదల చేసి డొంకరాయి జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు వెంటనే అధికారులు పనులను చేపట్టినప్పటికీ వాతావరణం అనుకూలించక పోవడం పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో గండి పూడ్చే పనులకు ఆటంకం కలిగింది. వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు గండి పనులను వేగవంతం చేశారు రేయింబవళ్ళు అధికారులు శ్రమించడం తో ఈనెల 16 నాటికి గండి పనులు పూర్తయ్యాయి దీంతో 16 సాయంత్రం పవర్ కెనాల్ నుంచి నీటి విడుదల ప్రారంభించారు నీటి విడుదల అయితే ప్రారంభించారు కానీ డొంకరాయి జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు 70 రోజులు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోవడంతో యూనిట్లు, ఉష్ణోగ్రత పెరుగుదల సరిచూసి అన్ని సక్రమంగా ఉన్నాయని అధికారుల నుంచి సంకేతాలు రావడంతో సోమవారం ఉదయం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ప్రస్తుతం 17 మెగావాట్ల లోడుతో విద్యుత్ ఉత్పత్తి అధికారులు చేస్తున్నారు. పవర్ కెనాల్ ద్వారా 11.5 అడుగుల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు
Conclusion:M Ramanarao