ETV Bharat / state

Potturi Deepthi: అమ్మ చెప్పిన రహస్యం.. కోట్ల వ్యాపారం.. పొత్తూరి దీప్తి విజయం - పొత్తూరి దీప్తి విజయం

Potturi Deepthi: ఓ రోడ్డు ప్రమాదంవల్ల మంచానికే పరిమితమైంది. నడవడానికే కాదు, మాట్లాడ్డానికీ ఇబ్బంది. అయినా అక్కడే ఆగిపోకూడదనుకుంది. ఆ కష్టకాలంలోనే తన జీవితానికో గమ్యం నిర్దేశించుకుంది. ఆపైన వ్యాపారం ప్రారంభించి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది విశాఖకు చెందిన పొత్తూరి దీప్తి. ఆ అనుభవాల గురించి ఆమె మాటల్లోనే..

Potturi Deepthi success story
పొత్తూరి దీప్తి విజయం
author img

By

Published : Jun 6, 2022, 8:54 AM IST

Potturi Deepthi: రోడ్డు ప్రమాదం వల్ల మంచానికే పరిమితమైంది. కానీ, తాను అలానే ఉండాలనుకోలేదు.. ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగింది. ఆ కష్టకాలంలోనే తన జీవితానికో గమ్యం నిర్దేశించుకుంది విశాఖకు చెందిన పొత్తూరి దీప్తి. ఆ అనుభవాల గురించి ఆమె ఏం చెబుతోందంటే..

మాది విశాఖపట్నం. బిఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ పూర్తిచేసి ఒక బీమా సంస్థలో పనిచేసేదాన్ని. ఒకరోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. కిందపడినా, సులభంగానే లేచి ఇంటికి వెళ్లిపోయా. అప్పుడేమీ అనిపించలేదు కానీ, కొద్దిరోజులకి తీవ్ర అనారోగ్యానికి గురయ్యా. వైద్యుల్ని సంప్రదిస్తే వెన్నుపూసలోంచి ఒక డిస్క్‌ విరిగిపోయిందని చెప్పారు. దాంతో మంచానికే పరిమతమయ్యా. పది నిమిషాలు మాట్లాడితే చాలు, మళ్లీ రెండు గంటలకిగానీ మాట్లాడ్డానికి శక్తి వచ్చేది కాదు.

వైజాగ్‌లో ఎంత మంది వైద్యుల్ని సంప్రదించినా నయం కాదన్నారు. ఇది జరిగి ఏడేళ్లవుతోంది. అప్పటికి మా బాబుకి నాలుగేళ్లు. కనీసం వాడి అచ్చటాముచ్చటా తీర్చలేకపోతున్నానని కుమిలిపోయేదాన్ని. జీవితం గురించి ఎన్నో కలలుకన్నా. అవేవీ నిజం చేసుకోలేనా, నా జీవితం ఇంతేనా అని బాధపడుతూ కన్నీరుకార్చని రోజంటూ లేదు. చివరకు ఒక డాక్టర్‌ ఇచ్చిన మందులతో ఆరోగ్యం కాస్త మెరుగైంది.

రెండేళ్ల తర్వాత నాలుగు అడుగులు వేయగలిగా. వ్యాయామాలూ చేయడంతో అటూఇటూ కదలగలిగా. మంచానికి పరిమితమైనపుడు స్ఫూర్తి కోసం పుస్తకాలూ, పత్రికలూ చదివేదాన్ని. ఈనాడు వసుంధర కథనాలు స్ఫూర్తినిచ్చేవి. కొందరు విజేతలు చెప్పిన మాటల్ని రాసుకుని తరచూ చదువుతూ ఉంటే ఆలోచనల్లో మార్పు వచ్చింది. కాస్త తేరుకున్నాక.. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా.

నగరమంతా తిరిగి చూశా.. ఓరోజు రాగి, కొర్రలు, సామలు, జొన్నలు.. వీటిని కలిపి మరపట్టించిన దోసెల పిండిని అమ్మ పంపింది. ‘ఆరోగ్యానికి మంచిది నువ్వూ ఇంట్లో చేసుకో’ అంది. అప్పుడే మల్టీ మిల్లెట్‌ ఉత్పత్తుల ఆలోచన వచ్చింది. ఆరోగ్యవంతమైన జీవనానికి ఒకప్పటి ఆహారపుటలవాట్లను కొనసాగించాలన్న ఆలోచన ఈతరంలో పెరిగింది. అందుకే చిరుధాన్యాల మిశ్రమంతో ఏదైనా చేస్తే బాగుంటుందనుకున్నా.

వెంటనే విశాఖలోని ప్రముఖ దుకాణాల్లో వారంపాటు తిరిగి వాకబు చేశా. ఎక్కడా అలాంటివి లేకపోవడంతో వాటి తయారీకి సిద్ధమయ్యా. కొద్ది రోజుల్లోనే రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, జొన్నల మిశ్రమంతో పిండి సిద్ధం చేశా. అప్పుడే అసలు సవాలు ఎదురైంది. మార్కెటింగ్‌ ఎలా చేయోలో అర్థం కాలేదు. పెద్దగా మాట్లాడే స్వభావమూ కాదు నాది. దాంతో చేయలేనేమోనన్న సందేహం మొదలైంది. అప్పుడే మావారు శ్రీనివాసరాజుతోపాటు, కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహం ముందుకు నడిపింది. ‘పని మొదలుపెట్టకుండా ఓడిపోవడంకన్నా ప్రయత్నించి ఓడిపోవడం నయమ’న్న మాటలు ప్రేరేపించాయి. దీంతో దుకాణాలకు వెళ్లి మా ఉత్పత్తుల్ని అమ్మకానికి ఉంచమని స్వయంగా చెప్పేదాన్ని.

‘ఇప్పుడివి ఎవరు తింటారమ్మా’ అంటూ చాలామంది వెనక్కి ఇచ్చేసేవారు. కొందరు మాత్రం కొద్దిరోజులు పెట్టి చూస్తామని అవకాశమిచ్చారు. అలా 2017లో ‘ఎన్‌రిచ్‌’ పేరుతో మా ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. మా మల్టీ మిల్లెట్‌ పిండితో దోసె, చపాతీ, పూరీ ఏదైనా చేయొచ్చు. మైదా కలపకపోవడం, నాణ్యతలో రాజీ పడకపోవడం, అందుబాటు ధరకు ఇవ్వడంతో క్రమంగా డిమాండ్‌ పెరిగింది. మొదట్లో వద్దన్నవాళ్లే ఆర్డర్లు తీసుకుంటున్నారు.

రూ.3 వేల పెట్టుబడితో ప్రారంభించి ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల అమ్మకాల స్థాయికి వెళ్లగలిగా. తెలుగు రాష్ట్రాల్లో మా ఉత్పత్తులకి గిరాకీ బావుంది. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. పదిమందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నా. ‘నువ్వేనా ఇదంతా చేస్తోంది’ అని ఆశ్చర్యపోతుంటారు మా స్నేహితులు.

నూడిల్స్‌, సేమియా కూడా... చిరుధాన్యాలను తగిన మోతాదుల్లో కలపడంతో పోషకాలతోపాటు మిశ్రమానికి సరైన రుచి తోడవుతుంది. మిశ్రమంలో ఏది ఎంత కలిపితే బావుంటుందన్న రహస్యాన్ని అమ్మ చెప్పింది. అదే అనుసరిస్తున్నా. ముఖ్యంగా మల్టీ మిల్లెట్‌ పిండితో వేసిన దోసెలు కరకరలాడటంతో పిల్లలెంతో ఇష్టంగా తింటారు. మొలకలు వచ్చిన రాగులు, పెసలు, జొన్నలు, ఉలవలు, కొర్రలు, సామలు, అరికెలు, అవిసెగింజలు, బార్లి, బాదం కలిపి పొడి చేస్తున్నాం. దీన్ని పాలలో కలిపి పిల్లలకి పోషకాహారంగా ఇవ్వొచ్చు.

కొర్రలు, సామలు, అరికెలు, రాగులతో సేమియా.. కొర్రలు, అరికెలతో నూడిల్స్‌ చేస్తున్నాం. చిరుధాన్యాలతోనే స్నాక్స్‌, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, అప్పడాలు వంటివెన్నో తెచ్చాం. దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రదర్శనలు మా మార్కెట్‌ ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ఉపయోగపడుతున్నాయి. ‘నేను చేయగలనా అన్న ఆలోచనల్లోంచి.. నష్టాలు వస్తే రాని, అనుభవ పాఠాలు నేర్చుకోవచ్చ’న్న స్థాయికి చేరుకున్నానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆరోజు ప్రమాదం జరగకుంటే ఇదంతా చేసేదాన్ని కాదేమో. ఆ కష్టమే పోరాడటాన్ని నేర్పింది! విజయాన్ని అందుకునేలా చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.