ప్రస్తుతం 134 కోట్ల జనాభాతో ఉన్న భారత్ 2027 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించబోతోందని పరిశోధనలు అంటున్నాయి. యువత అధికంగా కలిగి, భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుందని చెబుతున్నారు. యూరప్ లాంటి దేశాల్లో వయో వృద్ధులు అధికమై, యువత తగ్గిపోతున్న తరుణంలో ప్రపంచ దేశాలకు సర్వీస్ సెక్టార్లో భారత్ ఒక ప్రధాన వనరుగా ఉంటుందని అంటున్నారు.
పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంటున్నారు నిపుణులు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. భారతీయుల్లో సంతాన ఉత్పత్తి శాతం తగ్గుతోంది. దీని వల్ల భవిష్యత్లో అనేక ఇబ్బందులు వస్తాయని పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతానికి స్వీడెన్, జపాన్ వంటి దేశాలు జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని, మన దేశంలో అలాంటి సమస్యలు లేవని విశ్వవిద్యాలయం వెల్లడించిన పరిశోధనలో తేలింది.