మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఏజెన్సీలో... ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే.. పోలింగ్ సమయాన్ని కుదించనున్నారు. మావోయిస్టులతో ముప్పున్న కొన్ని పోలింగ్ కేంద్రాలను.. సమీప గ్రామాలకు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు. మన్యంలో ప్రత్యేక శాంతి భద్రతల దృష్ట్యా సమయాన్ని 3 గంటలు తగ్గించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 2 గంటలకే ముగియనున్నట్లు కలెక్టర్ వినయచంద్ తెలిపారు.
గూడెంకొత్తవీధి మండలంలోని గుమ్మిరేవుల కేంద్రాన్ని దారకొండకు, ఎ.దారకొండలోని ఓ కేంద్రాన్ని సప్పర్లకు మార్చనున్నారు. బూసిపుట్టు కేంద్రాన్ని కుమడకు, రంగబయలు పోలింగ్ కేంద్రాన్ని వనుగుమ్మకు, బుంగాపుట్టు కేంద్రాన్ని లక్ష్మీపురానికి, గిన్నెలకోట కేంద్రాన్ని కొరవంగికి, ఇంజరి కేంద్రాన్ని బొంగరం, ఇల్లంకోట కేంద్రాన్ని బొయితిలికి, ఇరగాయి కేంద్రాన్ని లోతూరుకు మార్చుతున్నారు. కొయ్యూరు మండలంలోని గిరిమందకు చెందిన రెండు కేంద్రాలను బూదరాళ్లకు, పలకజీడిలో ఓ కేంద్రాన్ని యు.చీడిపల్లికి తరలిస్తున్నారు.
ఇవీ చూడండి: