విశాఖ జిల్లా పాయకరావుపేట సమీపంలోని నాటుసారా తయారీస్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. పాయకరావుపేటలోని గోపాలపట్నం వద్ద ఎస్సై విభీషణరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి... సుమారు 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చూడండి: