ETV Bharat / state

మన్యంలో తుపాకులు వదిలి.. పాఠాలు చెబుతున్న ఖాకీలు!

విశాఖ మన్యంలో నిత్యం ఆయుధాలతో సంచరించే పోలీసులు.. రెండు రోజులుగా వాటిని ప‌క్క‌న‌బెట్టి మారుమూల గ్రామాల్లో చిన్నారులకు పాఠాలు బోధిస్తున్నారు. క‌రోనా కారణంగా చదువులకు దూరమైన వారికి పాఠాలు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా పాఠశాలలు మూత‌ పడిన నేపథ్యంలో... మన్యంలో పోలీసులు గ్రామాలను సందర్శిస్తున్నారు.

Police teaching at visakha
చిన్నారులక పాఠాలు బోధిస్తున్న పోలీసులు
author img

By

Published : Jul 15, 2021, 10:00 PM IST

చిన్నారులక పాఠాలు బోధిస్తున్న పోలీసులు

విశాఖ మన్యంలో మారుమూల గ్రామాలను పోలీసులు సందర్శించి.. స్థానిక చిన్నారులకు చదువు చెబుతున్నారు. ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు.. సీలేరు ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు గ్రామాలను సందర్శిస్తున్నాయి. గత కొంత కాలంగా చదువుకు దూరమైన చిన్నారులతో కాసేపు గడిపి.. వారికి పాఠాలు బోధిస్తున్నారు. ఒక వైపు వర్షాలు పడుతున్నా... గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

ఇవాళ... గూడెం కొత్తవీధి మండలంలోని గుమ్మిరేవుల పంచాయ‌తీ (తూర్పు గోదావ‌రి జిల్లా స‌రిహ‌ద్దు)లోని పలు గ్రామాలకు వెళ్లారు. ఆయా గ్రామాల్లోని చిన్నారులతో సరదాగా కాసేపు గడిపి పాఠాలు బోధించారు. క‌రోనా కారణంగా చిన్నారులు.. తమకు వచ్చిన చదువును సైతం మరిచిపోతున్నారని ఎస్సై రంజిత్ అన్నారు. అందుకే తమ వంతుగా సాయం చేస్తున్నామని.. గ్రామాల్లోని యువత ముందుకొచ్చి రోజుకో గంట పాటు చిన్నారులకు చదువు చెప్పాలని ఎస్సై సూచించారు.

ఈ సందర్బంగా.. పలు గ్రామాల్లోని గిరిజనులు.. వారి గ్రామాల్లోని స‌మ‌స్య‌ల‌ను ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఎస్సై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం సీజనల్​ వ్యాధులకు సంబంధించి గిరిజనులకు అవ‌స‌ర‌మైన మందులు అందజేసి వాటిని ఎలా ఉప‌యోగించాలో వివరించారు. యువకులకు చదువు, ఉద్యోగ‌, ఉపాధి అవకాశాల గురించి వివ‌రించి వాలీబాల్ కిట్లు అందజేశారు.

ఇదీ చదవండి:

'తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.