ETV Bharat / state

కబేళాకు లేగదూడల తరలింపు యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు - ఆనందపురంలో అక్రమంగా లేగదూడల తరలింపు

విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముకుందపురం, రేగానిగూడెం మధ్య.. 100కు పైగా లేగదూడలను అక్రమంగా కబేళాకు తరలించడానికి కొందరు ప్రయత్నించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేసి.. మూగజీవాల తరలింపును అడ్డుకున్నారు.

police stopped calves illegal transport in anandapuram
కబేళాకు లేగదూడల తరలింపును అడ్డుకున్న ఆనందపురం పోలీసులు
author img

By

Published : Feb 28, 2021, 6:55 AM IST

కబేళా తరలింపుకు సిద్ధం చేసిన లేగదూడలు

లేగదూడలను అక్రమంగా కబేళాకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముకుందపురం, రేగానిగూడెం మధ్యలో చెరువు వద్ద.. వందకుపైగా దూడలను కబేళాకు తీసుకెళ్లేందుకు కొందరు సిద్దమయ్యారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మూగజీవాలను స్వాధీనం చేసుకున్నారు.

సింహాచలం దేవస్థానానికి మొక్కుగా సమర్పించిన లేగదూడలను.. అక్రమంగా కబేళాకు తీసుకెళ్లడం దారుణమని గ్రామస్థులు వాపోయారు. భక్తి బావంతో స్వామివారి సన్నిధికి ఇచ్చిన లేగదూడల తరలింపును అరికట్టాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భక్తులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

విశాఖ బంద్​కు మద్దతివ్వాలని గంటాకు వినతిపత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.