స్థానిక సంస్థలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన అనుభవంతోనే ఈ ఎన్నికలకు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రచారం కోసం విశాఖ నగరానికి వచ్చే రాజకీయ ప్రముఖుల పర్యటనలకు భద్రత కల్పిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల కోసం అవసరమయ్యే భద్రత సిబ్బంది వివరాలను డీజీపీ కార్యాలయానికి పంపించామని తెలిపారు.