విశాఖ మన్యం జీ. మాడుగుల మండలంలో పోలీసులు సోదాలు చేపట్టారు. మావోయిస్టు సానుభూతిపరులు సంచరిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. మండలంలోని నుర్మతి కూడలి, ఉరుము సెంటర్లలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందం అడుగడుగునూ క్షుణ్నంగా పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించి, వారి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేశారు. కొత్తగా ఎవరైనా ప్రవేశిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్సై ఉపేంద్ర స్థానికులకు సూచించారు.
ఇవీ చదవండి.. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లించాలి: సుంకర పద్మశ్రీ