విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని బలిజపాలెం, కసిరెడ్డిపాలెం, గుర్రలపాలెంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 800 లీటర్ల పులుపు పారబోసి...సారా తయారికి సిద్దం చేసిన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈదాడుల్లో నాటుసారా తయారు చేసే నిందితుడు తప్పించుకున్నట్లు రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి