ETV Bharat / state

Mavoist: విశాఖ మన్యంలో కొనసాగుతున్న కూబింగ్..భయం గుప్పిట్లో గిరిజనులు

విశాఖ జిల్లా తీగలమెట్ట ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..మరికొంత మంది మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారు. గాయపడ్డ మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో మళ్లీ ఏం జరుగుతుందోనని మన్యం గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.

police crumbing at vishaka agency for maoists
విశాఖ మన్యంలో కొనసాగుతున్న కూబింగ్
author img

By

Published : Jun 22, 2021, 10:13 PM IST

విశాఖ జిల్లా తీగలమెట్ట ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..మరికొంత మంది మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనుమానం వచ్చిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. తీగ‌ల‌మెట్ట‌లో ఎదురుకాల్పులు అనంత‌రం..విశాఖ‌-తూర్పు ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టు స్థావ‌రాలపై నిఘా పెంచారు. గ‌త నెల‌లో పాల‌స‌ముద్రం వ‌ద్ద జ‌రిగిన ఎదురుకాల్పుల సంఘ‌ట‌న నుంచి మావోయిస్టులు త‌ప్పించుకున్న‌ప్ప‌టికీ..అక్క‌డ ల‌భించిన స‌మాచారం తీగల మెట్ట వద్ద మావోలను అంతమెందించి విజయం సాధించారు.

ఆందోళనలో గిరిజనులు

ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..పెద్ద సంఖ్య‌లో మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారన్న సమాచారం ఉంది. తప్పించుకున్న వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉండటంతో పోలీసులు అలుపెర‌గ‌కుండా గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఏవోబీ స‌రిహ‌ద్దుల్లో ఉన్న అన్నవరం నుండి కోటగున్నలు వరకు అట‌వీ ప్రాంతాన్ని, ర‌హ‌దారి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో మళ్లీ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.

లొంగిపోతే చికిత్స అందిస్తాం

ఎదురు కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు లొంగిపోయినట్లయితే వారికి వైద్య సేవలు అందించి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని విశాఖ జిల్లా అద‌న‌పు ఎస్పీ(ఆప‌రేష‌న్స్‌) సతీష్ కుమార్ తెలిపారు. వారికి వైద్యంతో పాటు ఆర్థిక భ‌రోసా కల్పిస్తామన్నారు. మావోయిస్టులు అడవిని వదలి..ప్ర‌శాంత‌ జీవితం గ‌డ‌పాల‌న్నారు.

ఇదీచదవండి

vishaka Cross fire: బూటకపు ఎన్​కౌంటర్ కాదు.. పక్కా సమాచారంతోనే: ఓఎస్డీ సతీష్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.