విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని మారుమూల అటవీ గిరిజన ప్రాంతాల్లో... నాటుసారా స్థావరాలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు పదహారు వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే సారా తయారీకి ఉపయోగించే వంటపాత్రలు ఇతర ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత సింగవరం , సింగరాజు పేట, మర్రిపాలెం, డౌనూరు...ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో కొయ్యూరు పోలీస్ సిబ్బంది ఎస్సై నాయుడు, రాము, రమణ, మూర్తి పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...
లైవ్: ఎర్రచందనం స్మగ్లర్ బాషాభాయ్ అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న కడప ఎస్పీ అన్బురాజన్