విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు, తంగుడుబిల్లి గ్రామాల సరిహద్దులో జీడిమామిడి తోటల్లో నాటుసారా తయారీ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1000 లీటర్ల బెల్లం ఊట గుర్తించి ధ్వంసం చేసినట్లు ఎస్ఐ సురేశ్‌కుమార్ చెప్పారు. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి
ఆటోలో అక్రమంగా నల్లబెల్లం, అమ్మోనియా తరలింపు...ఇద్దరు అరెస్ట్