ముంచంగిపుట్టులో క్రీడా మైదానం ప్రారంభం - balimela incident
విశాఖ జిల్లా ముంచంగిపుట్టులో క్రీడా మైదానాన్ని విశాఖపట్నం రేంజ్ డీఐజీ రంగారావు ప్రారంభించారు. విద్యార్థులు కవాతు చేసి ఆయనకు గౌరవ వందనం తెలిపారు. ఈ మైదానం నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎస్ఐ ప్రసాదరావును పోలీసులు సన్మానించారు. బలిమెల ఘటనలో మృతి చెందిన ఎస్ఐ శంకరరావు పేరును మైదానానికి పెట్టారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.