మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేసే కసరత్తు తుదిదశకు చేరుకుంది. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం, పాయకరావుపేట, నక్కపల్లి పంచాయతీలను అప్గ్రేడ్ చేసి నగర పంచాయతీలుగా మార్చే౦దుకు.. సంబంధిత అధికారులు గత ఏడాది డిసె౦బర్ 13న గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇటీవల తాజా ఉత్వరుల ప్రకారం పాయకరావుపేట, నక్కపల్లిని నగర పంచాయతీలుగా మారుస్తున్నట్టు పేర్కొన్నారు.
పాయకరావుపేటలో 2011 జనాభా లెక్కల ప్రకారం 35 వేల మంది ఉన్నారు. దీనిని మున్సిపాలిటీగా చేయాలంటే 40 వేలు జనాభా ఉండాలి. సమీప గ్రామాలైన అరట్లకోట, పీ.ఎల్ పురాన్ని విలీనం చేసినా జనాభా సరిపోకపోవడంతో అధికారులు మున్సిపాలిటీ ప్రతిపాదనను విరమించుకున్నారు. నగర పంచాయతీగా చేసి భవిష్యత్లో మున్సిపాలిటీగా చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ఇక నక్కపల్లి విషయానికొస్తే.. పారిశ్రామిక౦గా అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అనేకమంది ఇక్కడ స్థిరపడుతున్నారు. దీనితో ఈ పంచాయతీ పరిధిలో జనాభా భారీగా పెరిగారు. ప్రస్తుతం 10 వేల జనాభాతోపాటు, దీని పరిధిలోని 3 కిలో మీటర్ల సమీపంలో ఉన్న కాగిత, ఎన్. నర్సాపురం, సీహెచ్ఎల్ పురం, బోదిగలం, న్యాయంపూడి తదితర గ్రామాలను విలీనం చేసి నగర పంచాయతీగా చేసేందుకు చర్యలు చేపట్టారు.
గతంలో మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులకు పంచాయతీలకు సంబంధించిన నివేదికలు పంపి౦చినట్లు ఈవో ఆర్డీ వెంకట నారాయణ తెలపగా.. దీనిపై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు.
ఇదీ చూడండి:ఆ పల్లెల్లో.... నిద్రలోనూ తుపాకీ శబ్దమే వినిపిస్తోంది!