విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద డివిజన్ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. ఫోటో అండ్ వీడియోగ్రఫీలను ప్రత్యేక వృత్తిగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో తమ ఉపాధి పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని విచారం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. తమకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి