విశాఖ మన్యం పాడేరు- పెదబయలు మండలాల సరిహద్దు ప్రాంతమైన జల్లిపల్లి మత్స్యగెడ్డలో మృతదేహం లభ్యమైంది. చెక్క రాయి గ్రామస్థులు స్నానం చేయడానికి వచ్చి మృతదేహం తేలి ఉండడం చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడ్ని మెరకచింతకు చెందిన సోమేలి లక్ష్మయ్యగా గుర్తించారు. 2 రోజుల నుంచి అతను కనిపించడంలేదని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ ప్రారంభించారు.
ఇవీ చదవండి.. అనకాపల్లిలో 4 వేల మందికి కూరగాయల పంపిణీ