విశాఖలో సబ్సిడీ ఉల్లి పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎంవీపీ రైతు బజార్ వద్ద ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఉల్లి కోసం వినియోగదారులు ఉదయం నుంచే బారులు తీరారు. జనం ఎక్కువగా రావడం వల్ల కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వినియోగదారులను నియంత్రించారు. కొద్దిసేపు పోలీసులు, వినియోగదారులు మధ్య వాగ్వాదం జరిగింది. క్యూలైన్లో నిల్చున్న కొంత మంది వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. వీరికి పోలీసులు సపర్యలు చేశారు. క్యూలో ఉన్న వారందరికీ రాయితీ ఉల్లి ఇవ్వాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: