విశాఖలో ఫ్రంట్ లైన్ వారియర్‌గా పనిచేస్తోన్న లక్ష్మి అపర్ణ పట్ల పొలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఎల్ఐసీ కూడలి సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు అందోళన నిర్వహించాయి. అసభ్యకరంగా వ్యవహరించిన ద్వారకా సీఐ అప్పారావు, మూడో పట్టణ ఎస్సై రాముపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
ఒక దళిత యువతి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం సిగ్గుచేటని ఐద్వా నగర కార్యదర్శి ప్రియాంక విమర్శించారు. బైక్ తాళాలు, ఫోన్ లాక్కుని ఓ ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన పోలీసులు తమ తప్పు లేదని చెప్పుకునేందుకు యత్నించడం దారుణమన్నారు.
ఇదీ చదవండి: పెట్రో ధరలు తగ్గించి.. నిత్యావసరాల ధరలు అదుపుచేయాలి