ETV Bharat / state

ఒక్క వాల్తేరు డివిజన్​లోనే రూ.7కోట్లు చెల్లించారు..!

వాల్తేర్ డివిజన్​లో వివిధ కారణాలతో టిక్కెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు ఏడు కోట్ల రూపాయలను రైల్వే అధికారులు తిరిగి చెల్లించారు. ఇందులో కేవలం పది శాతం మాత్రమే డిజిటల్ చెల్లింపులు కాగా.. మిగితాది నగదు రూపంలో చెల్లించారు. విశాఖపట్నంలో ఉన్న రిజర్వేషన్ కార్యాలయం నుంచే ఐదు కోట్ల రూపాయలు వాపసు ఇచ్చేశారు.

Payment of Rs.7 crores in Walther division in refund for railway passengers
రీఫండ్ రూపంలో వాల్తేరు డివిజన్​లో రూ.7కోట్లు చెల్లింపులు
author img

By

Published : Jun 25, 2020, 8:07 AM IST

తూర్పుకోస్తా రైల్వేలో వాల్తేర్ డివిజన్​... కరోనా వల్ల రద్దయిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు భారీ మొత్తంలోనే నగదు వాపసు ఇచ్చింది. ప్రతి రోజూ విశాఖ నుంచి దాదాపు 150 నుంచి 180 రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. మార్చి నెలలో ఆరంభమైన లాక్ డౌన్, తర్వాత పూర్తిగా రైళ్ల రద్దుతో ప్రయాణాలన్నీ అగిపోయాయి. అన్​లైన్​లో టిక్కెట్ల రుసుమును వాపసు తీసుకునేందుకు అవకాశం ఇచ్చినా.. లాక్​డౌన్ అనంతరం కౌంటర్లను తెరిచిన తర్వాతే నగదు రూపంలో సొమ్మును తీసుకున్నారు.

జూన్ ఒకటి నుంచి సొమ్ము రీఫండ్​ను ప్రారంభించిన రైల్వే అధికారులు... రద్దయిన రైళ్ల ప్రయాణికులందరికి పూర్తిగా డబ్బును ఇచ్చారు. వాల్తేరు డివిజన్​లోని విజయనగరం, శ్రీకాకుళం రోడ్, రాయగడ రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కేంద్రాలన్నింటిలోనూ దాదాపు రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని తిరిగి చెల్లించారు.

ప్రస్తుతానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా.. గోదావరి ఎక్స్​ప్రెస్, ఏపీ ఎక్స్​ప్రెస్ నడుస్తున్నాయి. ఇవికాకుండా ఫలక్​నుమా, దురంతోలు కూడా విశాఖ మీదుగా నడుస్తున్నాయి. రైలు ప్రయాణాలు ఆరంభించిన తొలినాళ్లలో రద్దీ బాగా ఉండేది. ఇప్పుడు మాత్రం తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

ఇదీచదవండి.

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చీకటైపోయిన జీవితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.