Protest: సరైన వైద్యం అందించడం లేదంటూ విశాఖ కేజీహెచ్‌లో రోగి బంధువులు నిరసనకు దిగారు. తేనెటీగల దాడిలో గాయపడిన కంచరపాలెంకు బాబూరావు అనే వ్యక్తిని... ఈ నెల 19వ తేదీన ఆసుపత్రిలో చేర్పించారు. పది రోజులవుతున్నా పరిస్థితి మెరుగుపడకపోవడం, అలాగే కాలు నల్లగా మారడంతో... తగిన చికిత్స అందించాలని రోగి బంధువులు కోరారు. అయితే చాలామంది వైద్యులు, వైద్య సిబ్బంది బదిలీపై వెళ్లిపోయారని.. ఆసుపత్రి నుంచి రోగిని తీసుకుపోతే మంచిదని సలహా ఇచ్చారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పది రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నా సరైన చికిత్స అందించకుండా ఇప్పుడు తీసుకుపొమ్మంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబూరావుకు ఇన్‌ఫెక్షన్ పెరగడం వల్ల కాలు వాచిందని, చికిత్స చేయడానికి పరిస్థితి అనుకూలంగా లేదని వైద్యవర్గాలు అంటుండగా.. విచారణ చేయించి వాస్తవాలు తెలుసుకుంటామని కేజీహెచ్ సూపరింటెండెంట్ చెబుతున్నారు.
ఇదీ చదవండి: సచివాలయ ఉద్యోగుల నిర్వాకం.. విధులకు హాజరుకాకుండానే వేతనాలు