విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముకుందాపురంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలింగ్ మొదలైన మూడు గంటల్లో.. 72 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా వరకు పోలింగ్ పూర్తి కావడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు లేకుండా.. పోలింగ్ సిబ్బందే ఎక్కువగా కనిపిస్తున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తరువాత లెక్కింపు ప్రక్రియ మొదలు పెడతామని పీఓ వంగపండు దుష్యంత తెలిపారు.
103 సర్పంచ్, 904 వార్డులకు ఎన్నికలు
విశాఖ రెవెన్యూ డివిజన్‌లోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల్లోని 103 సర్పంచ్, 904 వార్డులకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 103 పంచాయతీలకు 279 మంది సర్పంచ్ అభ్యర్ధులు పోటీ పడుతుండగా.. 904 వార్డులకు 1965 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.
ఈ ఎన్నికల్లో 2,28,879 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1068 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు 1320 పీఓ, 1965 మంది ఏపీఓలను నియమించారు. 68 సమస్యాత్మక పంచాయతీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికలో.. మహిళ పోలీస్, శిశు సంక్షేమ సిబ్బంది మొదటి సారి విధులు నిర్వహించారు. ఓటర్లు కోవిడ్ నియమాలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
భీమునిపట్నంలో
భీమునిపట్నం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం 63 పంచాయతీలకు గానూ 9 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 54 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది.
ఇదీ చదవండి: